రవీంద్ర ఠాగూర్ జయంతి సందర్బంగా
ప్రకృతి ఆరాధనే ప్రధానం
ప్రభువుకు విన్నపం
గీతాసుమాలతో అర్చనం!!
శ్రామిక శక్తికి పట్టం
జ్ఞానానికి దేదీప్యమానం
ప్రేమకు వేశాడు పీఠం!!
నిరాశా నిస్పృహలకు దూరం
విరబూసిన తాత్విక సౌందర్యం
భక్తి మార్గంలో జీవనపయనం!!
గీతాంజలికి దీటేది సాటేది
ఆధునిక జీవన గీతోపదేశం
అనుసరణీయం రవీంద్ర మార్గం!!
మొట్టమొదటి ఐరోపా ఖండేతరుడు 1913లో
సాధించిన నోబుల్ ఘనత
భారతదేశానికి కలికితురాయి!!
దేశ ఔన్నత్యాన్ని నలుదిశలా చాటి
శాంతి నికేతనం స్థాపించె
గీతామృతాన్ని పంచెను!!
ఐరిష్ కవి మెప్పును పొందిన
మహాజ్ఞాని, కవి రవీంద్రుడు
భారతావని ముద్దుబిడ్డడు
అందుకో మా కైమోడ్పులు!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి