సిద్ధార్థ: వై . ఎస్ . శర్మ

 వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన మిత్రులు జి.నారాయణ అలియాస్ సిద్ధార్థ హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాకు, నరెడ్ల శ్రీనివాస్ కు జూనియర్.మాది మొదటి బ్యాచ్ ఆయనది, సాహు లది  రెండవ బ్యాచ్.
విద్యార్థి దశ నుండే రంగస్థల నటుడిగా ఆయనకు పేరు ఉంది.మాకు గురువు గారైన ఆకుల లింగయ్య గారు చల్లూరు హైస్కూల్ ప్రధానోపాధ్యాయునిగా ఉన్నప్పుడు అక్కడ నాటకాల పోటీలను నిర్వహించారు.
అప్పుడు హుజూరాబాద్ నవోదయ కళా బృందం"నీరుపోయ్" అనే నాటికను ప్రదర్శించారు.ఆ నాటికకు ప్రయోక్తగా,నటుడిగా నా సహ విద్యార్తి వహీదుల్లఖాన్ ఉన్నారు.
అప్పుడు ఆ బృందంతో కలిసి నేను కూడా చల్లూరు కు వచ్చాను.
ఆ తర్వాత సిద్ధార్థ నాన్ మెడికల్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరి మెట్ పల్లి ప్రాంతానికి వెళ్ళి,నటుడిగా,జర్నలిస్ట్ గా,శాతవాహన కళాస్రవంతి సంస్థ వ్యవస్థాపకుడు గా పనిచేశారు.
సాంస్కృతి రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన స్మారక అవార్డులను ప్రదానం చేయడం సంతోషాన్ని కలిగిస్తుంది.
మీకు ధన్యవాదాలు...
కామెంట్‌లు