రియల్ ఎస్టేట్ దందా పుట్టి ,
పంటపొలాలను పాతిపెట్టి ,
ఇళ్లు మీద ఇల్లు కట్టి ,
పచ్చదనానికి బొంద పెట్టి ,,
ప్లాస్టిక్ వ్యర్థాలను కుప్పగా పెట్టి ,
ఆ నేరాన్ని సూర్యభగవానుడు పైనెట్టి,
ఎండలు మండిపోతున్నాయి అంటాము !
దానికి కారణం మనమే అని మరిచి పోతుంటాము !
ఆక్వా రాకతో పచ్చదనం కాల రాచి ,
రోగాలబారిన పడుతున్నాం కాలుష్యము కోరలు చాచి ,
మరో పక్క బయటపెట్టుతున్నది ఓ ఎన్ జి సి బూచి !
ఇదివరకు బ్రతికేవాళ్ళం పచ్చదనం వాకిట్లో !!
ఇప్పుడు బ్రతుకుతున్నాం ఎక్కడ ఏటైమ్ కి
బ్లో అవుట్ వస్తుందో తెలియక భయం గుప్పిట్లో !!!!
కనుమరుగు అవుతున్న పచ్చదనం !!!!: - యెనుముల వేణుగోపాల రావు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి