బుద్ధుడి బోధనలు నేటి సమాజానికి స్ఫూర్తి

  గౌతమ బుద్ధుడు రాజ కుటుంబంలో పుట్టి సమాజంలోని అనేక విషాద సంఘటనలు చూసి చలించిపోయి ,కుటుంబం వదిలి అడవుల్లో తపస్సు చేసి జ్ఞానోదయంపొంది కోరికలను విడిచిపెట్టాలనీ, అహింసా మార్గం అనుసరించాలనీ ,అష్టాంగ మార్గం బోధించి  ప్రపంచానికి మార్గం చూపుతూ చేసిన బోధనలు నేటి సమాజంకు స్ఫూర్తిదాయకమని తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు డా. వాసరవేణి పర్శరాములు అన్నారు. 
     తేదీ 1-5-2026న యెల్లారెడ్డిపేటలో తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో బుద్దుడి జయంతిని నిర్వహించి ఆయన ఫోటోకు పూలాలంకరణచేసి అంజలి ఘటించారు.
       ఈ సందర్భంగా తెవిరసం అధ్యక్షుడు డా.వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ బుద్ధుడు క్రీస్తుపూర్వం 563 లో శుద్దోదనుడు, మాయాదేవిలకు జన్మించాడనీ తెలిపారు సమాజంలో జరుగుతున్న సంఘటనలను ,దుఃఖాన్ని చూసి చలించిపోయి కుటుంబాన్ని వదిలి, సన్యాసిగా మారి, తపస్సు చేసి, జ్ఞానోదయం పొందాడనీ అష్టాంగ మార్గం బోధించాడనీ, సరైన దృష్టి, సరైన మాట, కర్మ ,సంకల్పం, జీవనం ,వ్యాయామం, స్మృతి, ధ్యానం ఉండాలని తెలిపారని, మూఢనమ్మకాలు వద్దని ,భౌతికమైన విషయాలకు,వాస్తవాలకు, జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. నేటి సమాజంలో హత్యలు, అత్యాచారాలు, హింస ,దోపిడీ, క్రూరత్వం, స్వార్థం , మోసాలు, దొంగతనాలు పెరిగిపోయాయని ఇవన్నీ తగ్గాలంటే బుద్ధుని బోధనలు అనుసరణీయమని , అక్షరాల ఆచరిస్తే మంచి సమాజం ఏర్పడుతుందని అన్నారు. 
           ఈకార్యక్రమంలో తెవిరసం అధ్యక్షుడు డా.వాసరవేణి పర్శరాములు, జిల్లా కార్యదర్శి దుంపెన రమేశ్, బాలా గౌడ్,దనాల నర్సయ్య, మామిండ్ల కనకయ్య, సాయికృష్ణ, డి. నవనీత్, ముఖేష్, దుంపెన హరికన్న తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు