కోడి పుంజు కాయల కోమలాంగి: -డా. కందేపి రాణీప్రసాద్

 హలో పిల్లలూ ! కోడి పుంజు చెట్టు అంటే మీకు తెలుసా !ఎప్పుడైనా వాటి పూలతో ఆడుకున్నారా ! మా తరం వాళ్ళు ఆ చెట్టు పూలతో ఆడుకున్నారు. ఈ పువ్వులు ఎర్రగా ఉంటాయి. దీని లోపల కేసరాలు గుత్తిగా వంకరగా ఉంటాయి. ముఖ్యంగా కేసరాలకు పుప్పొడి రేణువులు అడ్డంగా అమరి ఉండటం వల్ల పిల్లు ఆడుకునేవారు. కేసరాలను పిల్లలు చరోకరు పట్టుకుని మెలిక పెట్టి లాగుతారు.పుప్పొడి మొదటగా ఎవరిది తెగి క్రింద పడితే వారు ఓడిపోయినట్టన్నమాట ఈ చెట్టును ‘తురాయి’ అని కూడా అంటారు. ఇది మడగాస్కల్‌కు చెందిన పుష్పించే మొక్క. ఇది ‘ఫాబేసి’ కుటుంబం. సిసాల్పినిడే ఉప కుటుంబానికి చెందిన మొక్క. ఇది పసుపు, ఎరుపు రంగుల్లో పూలను ఇస్తుంది. వీటిని రోడ్డు ప్రక్కన, ఉద్యాన వనాల్లో పెంచుతారు. కొమ్మలు, ఆకులు జతలుగా ఉంటాయి. కాయవలు ఆకుపచ్చగా, మెత్తగా ఉంటాయి. ఈ కాయలు, పువ్వులతో అమ్మాయి బొమ్మ చేశాను.
కోడిపుంజు కాయలతో తల, చేతులు, కాళ్ళు తయారు చేశాను. జుట్టు కూడా తురాయి కాయలతోనే పెట్టాను. జుట్టు కోసం పువ్వుల కేసరాలతో నింపాను. కాళ్ళకు సాక్స్‌ కేసరాల గుత్తుల్ని పెట్టాను. అమ్మాయిల గౌను కోసం ఎర్రని పూల రెక్కల్ని ఉపయోగించాను. నేను కుట్టిన తురాయి పూల గౌను బాగుందా! కళ్ళ కోసం చింత గింజలు, నోటి కోసం శంఖు కాయను పెట్టాను. చేతులకు, కాళ్ళకు చెట్టు కొమ్మల్ని పెట్టాను.
కామెంట్‌లు