అమృతమయి !!!!: - - యెనుముల వేణుగోపాల్ రావు - అమలాపురం.

 పెదవులు రెండూ కలిపి 
పిలిచే పిలుపే.....అమ్మ !
ప్రేమానురాగాలతో.....
నిన్ను పెంచేదే ....అమ్మ !
కలలోకుడా చూడకూడదు
అనుకుంటుంది నీకంటి చెమ్మ  !
అమ్మ ప్రేమ లేకపోతే...
ఇక వృధాయే నీ జన్మ !
అమ్మ మనసు - నిర్మలం !
అమ్మ పలుకు - తీయదనం !
అమ్మ చూపు - చల్లదనం!
అమ్మ ఒడి - వెచ్చదనం !
అమ్మ ప్రేమ - అమృతం !
అసలు అమ్మ అన్న పదమే - మహా అద్భుతం !!
అందుకే...మరి ... అమ్మ ఙ్ఞాపకాలు ఎన్నటికీ మరువలేం !!!!
కామెంట్‌లు