చినుకు రాలితే
చిగురించిన ఆకుల్లా
మనసు తడికి
హృదయమెుకటి
కొత్తగా మెులుస్తుంటుంది
ఆవేదనొచ్చినపుడల్లా అత్తిపత్తిలా అది_ముడుచుకుపోతుంటుంది!
మౌనంతోనే అనుక్షణం సంగమిస్తూ
నిరంతరం తలపులతో పురుడు పోసుకుంటూనే ఉంటుంది!
పేరుకు గుప్పెడు మాంసపు ముద్దైనా
అంతులేని కలలు ..
కల్లలైన ఆ కలల కోసం కళ్ళలో జలపాతాలు ..!
కొన్నిసార్లు ఎగిసి ఎగిసిపడుతున్న ఆశల కెరటాలను మోస్తూ
తీరం చేరని అలల ఆశయాల కోసంఆ గుప్పెడే సాగరమంత
అవుతుంటుంది....!
కొన్ని ఆటుపోట్లు కుదించివేస్తుంటే
కొన్ని మౌనాలు కలిచివేస్తుంటే
నాకు నేనే అంతుపట్టనంత
శూన్యమవుతుంటుంది…..!!
***

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి