సంతవురిటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి ఉత్తీర్ణులతో విజ్ఞాన విహార వినోద యాత్ర చేపట్టినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.వెంకటరావు తెలిపారు. గతనెల విడుదలైన పదోతరగతి ఫలితాల్లో ఐదువందల పైబడి మార్కులు సాధించిన మర్రి మోహిత, సి.హెచ్. రోహిత్, చింత బాషా, కరగాన మణికంఠ, డి. భాను ప్రసాద్, చింత బాలాజీ, నల్లి దుర్గాప్రసాద్, పాలవలస సంతోష్, పెద్దింటి మురళీబాబు, కరణం హరితేజ, సుంకరి ధనలక్ష్మి, పోతురాజు కిరణ్, లాబాన రాఘవలు తమ పాఠశాలకు ఎంతో గర్వకారణంగా నిలిచారని అన్నారు. వారిని మరింతగా ప్రోత్సహిస్తూ ఆర్కే బీచ్, ఫిషింగ్ మార్ట్, ఎయిరోప్లేన్ మ్యూజియం, ఉడా పార్క్, కైలాసగిరి, జంతుప్రదర్శన శాల, ఇష్కాన్ టెంపుల్, రిషికొండ బీచ్ వేంకటేశ్వర ఆలయం మున్నగు పర్యాటక క్షేత్రాలకు తీసుకుని వెళ్లి, ఆయా ప్రాంతాల విశేషాలతో కూడిన చరిత్రను స్వయంగా తెలుసుకునేలా అభ్యసనం గావించామని వెంకటరావు తెలిపారు. పాఠశాల సహోపాధ్యాయుల కార్యదర్శి సి.హెచ్. కమలాకర్ మాట్లాడుతూ
ఈ పర్యాటక ప్రాంతాల సందర్శన ద్వారా బాలబాలికలంతా మిక్కిలి విషయ పరిజ్ఞానాన్ని పొందుటతో పాటు, ప్రస్తుత పదోతరగతి విద్యార్థులకు పట్టుదలతో చదవాలన్న ఒక ఆరోగ్యకరమైన సంకేతాలు అందజేసినట్లైందని అన్నారు. ప్రథమ శ్రేణిలో నిలిచిన విద్యార్థులకు ఇలా విజ్ఞాన యాత్రను చేపట్టుట పట్ల వ్యాయామ ఉపాధ్యాయులు దాలి నాయుడు, వార్డెన్ కి.అప్పారావు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్ధులు పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఉపాధ్యాయులను బోధనేతర సిబ్బందిని అభినందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి