లేచాక కూడా వెంటాడి
నిజం చేసుకోవాలని
ప్రయత్నించే కలలు
జీవితానికి అవసరం
వినే మనసు లేనపుడు
తప్పు విప్పి చెబితే
వృధా ప్రయాస..
అపుడు మౌనమే అవసరం
కోరుకోవడం సహజం
సాధించుకోవడం సహజమే!
పొందాక దానిని పూర్తిగా
అస్వాదించడం కూడా అవసరం
అవకాశం దొరకదు
మనమే ప్రయత్నించాలి
దొరికాక వాడుకోడానికి
విచక్షణ అవసరం
ఇష్టమైనవన్నీ దొరకవు
దొరికినవి నచ్చవు
చేతిలో వున్న దాన్ని
ఇష్టపడ్డం అవసరం
ఉదయం అందరికీ ఒకటే
దొరికే కొత్త అవకాశమే
మంచిగా మలచుకోవడం
కచ్చితంగా అవసరమే!
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి