విశ్వామిత్ర మహర్షి జన్మ వృత్తాంతం : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
రామా ఆ బ్రహ్మపుత్రుడు వివాహం చేసుకొని 
కాంపిల్య నగరమునకు వెళ్లిపోయాక 
కుశనాభుడు పుత్రకామెశ్రియాగమును 
పుత్రులపై ఆ మహారాజు చేపట్టినాడు 

కుశనాభుని తండ్రి కుశుడు పుత్రున్ని చూసి 
సర్వసద్గుణములచే మిక్కిలి ధార్మికుడైన
గాధి యను పుత్రుడు నీకు కలుగుతాడు 
అతని వలన నీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి 

కుశుడు కుశనాభునితో ఇలా పలికి
ఆకాశమార్గమున బ్రహ్మలోకము చేరుతాడు 
కుశనాభుని భార్య ఘృతాచి గర్భం  దాల్చింది 
గాధి అనుపుత్రునికి జన్మనిచ్చింది 

మిక్కిలి ధర్మాత్ముడైన ఆ గాధియే నా తండ్రి 
రామా నేను కుశ వంశములో పుట్టితిని 
అందువలన నాకు కౌశికుడని పేరు పెట్టినారు 
సత్యవతి అనునామే నాకు అక్క ఉన్నది

ఆమెకు బూచుకునితో పెళ్లి జరిగింది 
ఆమె పేరు కౌశికి ఆమె చాలా సత్యవంతురాలు 
ప్రతిని అనుసరించి సశరీరముగా
ఆ ధర్మాత్మురాలు స్వర్గము చేరింది. 


కామెంట్‌లు