16 ఏళ్ల ప్రాయంలోనే 'అష్టావధాన అష్టధృతి' దిగ్విజయవతం
విజయవాడ (ఇంద్రకీలాద్రి):అవధాన కళలో అద్భుతం ఆవిష్కృతమైంది. కేవలం 16 ఏళ్ల వయసులో అసాధారణమైన ధారణా శక్తితో, అనన్యమైన పాండిత్యంతో మొట్టమొదటి సారిగా అష్టావధానం చేసి అందరినీ అబ్బురపరిచారు ఈ యువ అవధాని.
ప్రధానాంశాలు:
* వేదిక: విజయవాడ ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి.
* ప్రక్రియ: అష్టావధానం (పూరణ , ధారణ).
* సమయం: 1 గంట 8 నిమిషాల 12 సెకన్లలో అవధానాన్ని పూర్తి చేసి రికార్డు సృష్టించారు.
* బిరుదు: వీరి ప్రతిభకు గుర్తింపుగా "అష్టావధాన అష్టధృతి" అనే బిరుదు మరియు "అష్టావధాన స్మారక పత్రం" కైవసం చేసుకున్నారు.
* గౌరవ పురస్కారం:
ఇంద్రకీలాద్రి దేవాలయ ప్రధాన పురోహితుల వారి శుభాశీస్సులతో, వారి అమృత హస్తాల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. పృచ్చకులు అడిగిన ప్రశ్నలకు చమత్కారంతో, పాండిత్యంతో సమాధానాలిస్తూ చూపరులను మైమరిపించారు
* శుభాకాంక్షలతో...
అవధాన కళా పరిషత్, విజయవాడ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి