వెంటీలేటర్ అంటే
మనీ మేకింగ్ మిషన్
అన్నాడో హిందీ హీరో!
మరణించిన వాళ్ళక్కూడా
వైద్యం చేసినట్టు నటిస్తారు
అన్నాడో తెలుగు హీరో!
హాస్పిటల్ బిల్లు చూసే
గుండెపోటు వచ్చింది
అన్నాడో సామాన్యుడు!
నార్మల్ కాన్పు అవుతున్నా
పెద్దాపరేషన్ చేసేస్తారు
అన్నదో గృహిణి!
90 ఏళ్ళ ముసలాయన కూడా
డాక్టర్ నిర్లక్ష్యంతోనే
చనిపోయాడన్నాడొకడు!
'వైద్యో నారాయణో హరి' ని
వైద్యుడి వద్దకు వెళితే ‘హరీ’
అంటారు అన్నారంతా!
సినిమాల్లో అవినీతిపరులుగా
జోకులకో కంటెంట్ గా
వాడేశారు కవులంతా!
కానీ అకస్మాత్తుగా
కరడుగట్టిన కరోనా వచ్చింది
హఠాత్తుగా ప్రజలందరికీ
డాక్టర్లపై ప్రేమ పుట్టింది!
కరోనా ప్రాణం తీస్తుందనీ
డాక్టర్లే దిక్కని తెలుసుకొని
వారి వెనకే దాక్కుంటున్నారు!
పైన చెప్పిన వారందరూ!
అందుకే
చప్పట్లు కొడుతున్నారు
పొగడ్తల దండలేస్తున్నారు
వలపు పాటలు పాడుతున్నారు
ప్రేమ కవితలు రాస్తున్నారు
వైద్యులకో వందనం చేస్తున్నారు
శభాష్ అని మెచ్చుకుంటున్నారు
మరి వారందరికీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి