ఇరుకిరుకు గనుల్లో బొగ్గు తవ్వకాల్లో
ఇంటి బతుకులు బుగ్గై మసిబారిన
ఇనుప కొలుముల ఎర్రని మంటల్లో
ఇంకిన జీవితాలు మాడి నుసి నుసైనా
బంది ఖానాల ప్యాక్టరీల్లో బరువులు మోసి
బండ బారిన భవిష్యత్తు మగ్గి పోతున్నా
భారి మిషన్ల మధ్య చెరుకులా నలిగి పిప్పై
బలవంతపు చావులే బలి తీసుకుంటున్నా
కొండల్ని పిండి చేసి రాళ్ళు పగల గొట్టి
కాళ్ళు చేతులిరిగి ఒళ్ళు గుల్లయినా
కంకర రాళ్ళు కటిక తారుతో రోడ్లేస్తూ
కకావికలుగా చిద్రమై మౌనమైపోయినా
వంటింటి పోగల సెగల మధ్యలోనే
వంట్లోని రక్తమంతా పొగ చూరి పోతున్నా
వరి నారుమళ్ళు కోతలు కలుపులంటూ
వంచిన నడుమేత్తకుండా పని చేసినా
కర్షకులు కార్మికులు శ్రామికులు మహిళలకు
కష్టాల కడగళ్ళ రోగాల రోదనలే తోడుండేది!
ఉత్పత్తులు పెంచి ప్రగతి బాట పట్టించినా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి