సామెత -243: ఆ వూరి దొర ఈ వూరి తలారి అన్నట్టు
****
"అవ్వోవ్! కొంత మందిరికి దేవుడు తగిన శాత్తి చేత్తే ఇంకొందరికి కొన్ని సయిమాలు సందర్వాలు తగిన శాత్తి చేత్తయి. లేకపోతెనా గంత యిర్ర యీగుడా? "నేన్ జూడు నా గొప్ప సూడని" ఎవ్వలితో మాట్లాడినా మాటల్ల మామూలు పొగరు గరువం గాదు. ఎవలన్న తనని పట్టిచ్చుకోట్లేరు అన్కుంటే సాలు. గాళ్ళని ఎంతెంత శికాకు సేశేటోడని. గిప్పుడు మంచిగైంది.తెల్శిరావాలె అవ్వా! గట్ల తెల్శొత్తే ఇంకోపాలి గస్మంటి శెకలు జెయ్యరు.బుద్ధిని అద్దుల బెట్కుంటరు."
ఏందిరా అయ్యా! బుద్ధి,అద్దు అంటున్నవ్? ఎవలో గని నీ మన్సును శానా శానా కట్టబెట్టినట్టు అనిపిత్తుంది."
"అవునవ్వా!నన్నే గాదు నా దోత్తులను సుత గట్లనే అవుమానిచ్చిండు. శిన్నప్పుడు శెడ్డీలేస్కున్న వొయిసు నుంచి కల్శి సద్వుకున్నం.గాని అదృట్టం కల్శొచ్చి వాళ్ళ నాయిన సంపాయిచ్చిన పొలాలు,శెల్కలకు పెద్ద కాల్వ నీళ్ళొచ్చి ఎగుసం బాగ పెర్గింది. శేతినిండ పైసలు వూల్లె కన్బడ్డ బూవులు, శెల్కలు గొని పెద్ద ఆత్తిపరుడైండు.దొర లెక్క పెత్తనం శేత్తుండు."
శేత్తే నీ దోత్తానానికి గవి ఏమడ్డంరా అయ్యా! పేదోడైనా ఉన్నోడైనా దోత్తానంలో తేడాలుండవు కదరా!''
కొందరంతే అవ్వా! ఆత్తులు పెర్గే తల్కి కండ్లు నెత్తికెక్కుతయి.గస్మంటోళ్ళ వల్లనే దోత్తానం యిలువ సుత పోతున్నది. అయిన గని గానికి మంచి శాత్తే జర్గింది తీ."
అవునార అయ్యా! గింతకీ ఏం జరిగింది? గాని తప్పేదో గానికి తెల్శొచ్చిందా?"
"తెల్శొచ్చుడేందవ్వా! తెల్లమొగం ఏస్కుని తోక ముడ్సుకొని బోయిండు. గాడు గీ వూరికి వాళ్ళ సుట్టాలోల్లని మన భూషయ్య తాత మన్వడి లగ్గానికి వొచ్చిండు.గా పెండ్లిల్ల గాని దొరతనం సూపిచ్చుకో బొయ్యి మనూరోళ్ళని ఏదో మాట తూలిండంట. ఇంగ జూస్కో అవ్వా! గిప్పటి వొయిసు పొల్లగాండ్లు ఏవన్న అంటే పడ్తరా! అందరొక్కపాలె గాయికెత్తుకొని పొట్టు పొట్టు తిట్టిండ్రు. గండ్లొకడైతే"నీ దొరతనం పొయ్యి నీ వూళ్ళె సూపిచ్చుకో. గిక్కడ గస్మంటి శెకలు జేత్తే తోడ్కలు తియ్యడాన్కి సుత ఎన్కాడం" అన్నడు. ఇంగ గాని మొగంల"కత్తివాటుకు నెత్తురు సుక్క లేదన్కో ". నా దోత్తని తెల్శి ఒకడు లొల్లి ఎక్కడ పెద్దగైతదో నని నన్ను పిల్సకబోయిండు. నేను బొయ్యి అక్కడున్నోళ్ళని సముదాయిచ్చి గా లొల్లి ఆపిన.గాని శెయ్యి పట్కొని అక్కన్నించి శిన్నగ తప్పిచ్చి పంపిచ్చినవ్వా!"
గదేరా అయ్యా! "అన్వు గాని సోట గొప్పలు శెప్పుకుంటే గిట్లనే అయితది. "ఆ వూరి దొర ఈ వూరి తలారి" అంటే గిదే మరి. తలారొతికె( బంటొతికె )తలొంచుకుని ఉండాలె గని గిట్ల దొరనని ఊరు గాని ఊల్లె అంకారంతో గరువం సూపిత్తె గిట్లనే వుంటది. మాగనే శాత్తి అయ్యిందిరా అయ్యా!"
గదండీ సంగతి"ఆ వూరి దొర ఈ వూరి తలారి" అంటే గిదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి