కామధేనువును తనకు ఇమ్మని కోరుట: - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
అతిథిసత్కారమొంది విశ్వామిత్రుడు 
కామదేనువుపై కాంక్ష చెందినాడు 
ఓ బ్రహ్మనోత్తమ వినుమయ్యా 
కామదేనువు రాజులకడ నుండాలి

దాన్ని మాకివ్వుము ఓ బ్రహ్మనోత్తమా 
అది దేశానికి ఎంతో మేలు చేస్తుంది 
పేదల ఆకలి తీర్చి జనులను బ్రోవునది
ఇచ్చట మీ వరకే పరిమితమవుతుంది

ఓ మహార్షి దానిని నేను ఇవ్వలేను 
నేనున్నంత కాలము నాతో నుంటుంది
మా బ్రాహ్మణులందరికీ ఆకలి తీర్చును 
అదే నాకు సర్వసము మునివరా 

అది మాకు పంచభక్ష పర్వన్నాలను 
పవిత్రముతో అందరికీ వడ్డిస్తుంది 
పండ్లు ఫలాలు క్షీరము అందిస్తుంది 
ఆ దేవతను మీకు ఇవ్వలేను నేను 

కామధేనువు నన్ను వదిలి యుండదు
అది బ్రాహ్మణోతములకు ఇలవేల్పు 
పురవాసులకు అది కన్నతల్లి లాంటిది
నీమాట విననందుకు మన్నించయ్యా


కామెంట్‌లు