ఆరోగ్య సోపానం; - K లికిత -తెగడ.
పిల్లలు ఏడ్చి గోల చేస్తే... చేతికి ఇస్తారు రంగుల కోకా,
అది తాగిన చిన్నారి కడుపు... అవుతుంది రోగాల కోట!
రంగుల కోకా కాదు, తాజా జ్యూస్ ఇవ్వు!
 
ఇంటికి చుట్టాలు వస్తే చాలు... తెస్తారు లీటరు బాటిళ్లు,
మర్యాద అనుకుంటూ పోస్తారు... కడుపును ముంచే కెమికళ్లు!
కెమికల్ బాటిల్ కాదు, కమ్మని మజ్జిగ పొయ్యి! 

పెళ్లిళ్లు, పేరంటాలు జరిగితే... స్వాగత పానీయం అంటారు,
సందర్భం ఏదైనా సరే... కూల్ డ్రింక్ గ్లాసులు ఇస్తారు!
కూల్ డ్రింక్ గ్లాసులు కాదు, కమ్మని పానకం ఇవ్వు!

ఎండలు మండిపోతుంటే... దాహం తీరదంటూ వెళతారు,
మంచి నీళ్లను వదిలేసి... సోడాలు గటగటా తాగుతారు!
సోడాల గటగటా కాదు, నిమ్మరసం హాయిగా తాగు!

బిరియానీలు, పిజ్జాలు తిని... అరుగుదల కోసం అంటారు,
థంబ్స్-అప్ లు, స్ప్రిట్ లు తాగి... అల్సర్లు తెచ్చుకుంటారు!
థంబ్స్-అప్‌లు కాదు, జీలకర్ర నీళ్లు చాలు!

తిరిగి లిఖించండి... 
స్వాగత పానీయం... 
మన సాంప్రదాయ పానీయం పానకం.. అదే ఆరోగ్యానికి సోపానం!


కామెంట్‌లు