శీతల పానీయాలు కాదవి స్లో పాయిజన్లు..: -K లిఖిత -తెగడ
 శీతల పానీయాలు కాదవి స్లో పాయిజన్లు.
ఆహా! రంగు రంగుల శీతల పానీయాలు కాదవి... స్లో పాయిజన్లు!

లీటరు బాటిల్ తెరుస్తావు... లొట్టలు వేస్తూ తాగుతావు,
పది చెంచాల చక్కెరను... పొట్టలోన పోస్తావు!
ఇన్సులిన్ అన్నది ఇల్లొదిలిపోవు...
షుగరు వ్యాధితో నువ్వు సగం అయిపోవు!

గ్యాస్ నింపిన ఆమ్లాలు... కరిగిస్తాయి నీ పళ్లు,
పిప్పి పళ్ల నొప్పొస్తే... ఏడుస్తాయి నీ కళ్లు!
సినిమా హాళ్లలో స్ట్రాలు వేసి పీల్చుతావు...
డెంటిస్టు చుట్టూ తెల్లవారితే తిరుగుతావు!

కడుపులోన మంటలు... గ్యాస్ట్రిక్ లొంతలు,
లివరు పైన కొవ్వు చేరి... పెరుగుతాయి తిప్పలు!
గుండె నిండా కొలెస్ట్రాల్... కిడ్నీలోన రాళ్లు,
ఈ డ్రింకులు తాగితే... త్వరలోనే ఇరకటమే కాళ్లు!

అరుగుదల అనుకుంటే పొరపాటోయ్... 
అది అల్సరు తెచ్చే అలవాటోయ్! కనుక సోదరా...
రసాయనాల రంగుల జోలికి పోవద్దు...
డబ్బులు ఇచ్చి రోగాలు కొనవద్దు...

కొబ్బరినీళ్లు, మజ్జిగ జావ తాగి ఆరోగ్యాన్ని కాపాడు..
ఒళ్ళు రోగాల దిబ్బ కాదు.. ఆరోగ్యపు గుడి చెయ్యి...
అనారోగ్యాన్ని డాక్టర్ మందుల చీటీలో కాదు...
ఆరోగ్యాన్ని ఇంటి, వంటి నిండా లిఖించు!

మంగళం... మన ఆరోగ్యానికి శుభ మంగళం!


కామెంట్‌లు