వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
90. కులామృతైక రసికా (అష్టాక్షరీ)
91. కులసంకేత పాలినీ (అష్టాక్షరీ)
తొంభై ఒకటవ నామ మంత్రము -
ఓం కులసంకేత పాలిన్యై నమః
కులము = శాస్త్రము, సంకేతము = రహస్యము, పాలినీ = రక్షించునది.
శాస్త్ర రహస్యాలు ఎవరికిచెప్పవచ్చో, వారికి మాత్రమే చెప్తూ, సమయపాలన / నియమపాలనను పాటిస్తూ దర్శనమిచ్చిన శ్రీమాతను చూసి వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "కులసంకేత పాలినీ" అని కీర్తించారు. ఆ విధంగా నియమపాలన యొక్క అవసరాన్ని తాను ఆచరించి మనకు తెలియచెపుతున్న పరమేశ్వరికి నమస్కారము.
కులము = ఒకే విధమైన పద్ధతులను, శాస్త్ర విధులను పాటించేవారు కలిసిన సమూహము, కానీ ఇప్పుడు వాడుకలో ఉన్న కులము కాదు. సాధకులు, దేవతా ఉపాసన చేస్తారు. ఇక్కడ ఉపాసన చేసే సాధకులు, ఉపాసించబడుతున్న దైవ శక్తి, ఉపాసన చేయడానికి వాడబడుతున్న హోమద్రవ్యములు ..... ఈ విషయాలు అన్నీ కలిపి, "కులము"గా పరిగణించాలి. తన సాధకులలో, ఈ విధంగా శాస్త్ర నియమాలను పాటిస్తూ, తనను ఉపాసించే సాధకులకు మాత్రమే శ్రీవిద్య యొక్క రహస్యాలను బోధిస్తూ, సమయపాలనతో కులమును రక్షిస్తున్న జగన్మాత "కులసంకేత పాలినీ" అయ్యింది.
ఒక కులములో/శాస్త్రములో ఉన్న అనేక రహస్యాలను చక్కగా కాపాడుకుంటూ, సమయపాలన చేస్తూ తన సృష్టి లోని జీవులు ఉండాలి అని, సంకేత పుర్వకముగా, లలితా పరాభట్టారిక మనకు తెలియజేస్తోంది. "కులపుస్తకాని చ గోపయేదితి" (సౌభాగ్య భాస్కరం). అంటే, ఒక కులము లోని ఆచారాలు, సంప్రదాయాలను, రహస్యాలను అందరూ రక్షించుకోవాలి. వితండవాదం చేసేవారికీ, పద్ధతులకు నీళ్ళు వదిలేసే వారికీ, పురాణాలలో ఉన్న విషయాన్ని లౌకిక ధన సంపాదనకోసమే ఉపయోగించే వారికీ, ఈ శాస్త్ర రహస్యాలు చెప్పకూడదు.
శ్రీమాత, ఈ కుల రక్షణ నియమాలను ఎంత కష్టమైనా పాటించగలిగిన వారినే "గురువు" స్థాయిలో గుర్తింపు ఇచ్చచింది. ఈ కోవలో వచ్చిన వారే, శంకర భగవత్పాదులు, భాస్కరరాయల వారు. ఏ గురువైనా ఒక సాధకునకు, ఒక శాస్త్ర రహస్యము చెప్పేడప్పుడు, ఈ సాధకుడు తనచేత ఇవ్వబడుతున్న మంత్ర రహస్యాలను కాపాడగలడా, సరిగ్గా ఉపయోగించుతాడా అనే విషయాలు నిర్ధారణ చేసుకున్న తరువాత మాత్రమే, ఒక మంత్ర రహస్యాన్ని సాధకుడైన తన శిష్యునికి చెప్తారు. ఇదే, అమ్మ నేర్పిన సమయపాలన.
ఆగమ శాస్త్రం లో, చితామణి స్తవం లో, త్రిపురాదేవి సంకేతాలు ,చక్ర సంకేతము, మంత్ర సంకేతము, పూజా సంకేతము అనే, మూడు విధాలుగా చెప్పబడింది. ఏ కులాచారములో అయినా, రహస్యము, గోప్యత నియమాలను పాటించాలి. అందుకనే, అమ్మ యొక్క సహస్రనామాలు సాధన చేసేటప్పుడు కూడా, ఈ రహాస్య నియమాలను విధిగా పాటించాలి. "శ్రీవిద్య" ఎంతో నిగూఢమైనది. ఎక్కడ పడితే అక్కడ, ఎలావీలైతే అలా భహిర్గతము చేయకూడదు.
పైన చెప్పిన విధంగా, కుల రహస్యాలను రక్షణ చేస్తూ, తనను చేరుకోవాలి అని సాధన చేసే సాధకుని ఉద్ధతికి చేయూత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు
ఓం కులసంకేత పాలిన్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి