ప్రవాస పద్య పరిమళం - 13: - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 సముద్ర తీరంలో సాహితీ సేద్యం  పద్య నైవేద్యం...
(అట్లాంటిక్ మహాసముద్రం బీచ్ లో గత వారం మా విహార యాత్ర సందర్భంగా.. )



ఉత్పలమాల:

సాగరకన్య చెంత నొక చక్కని పద్యము వ్రాయ బూని, నే 
జాగిక సేయబోక తొలి సంధ్యన సైకత తీరమందునన్  
సాగర ఘోషలో తడిసి సంద్రపు గాలుల సేదతీరి, నే 
సాగితి పద్య పాదమున ఛందము గూర్చుచు ప్రాస గల్పుచున్ 

కామెంట్‌లు