గుడి లాంటి
మా ఖానాపూర్ బడిలో
సావిత్రిబాయి పూలే
కొలువై ఉన్నది.
ఆమె నీడలో పిల్లలు ఎందరో
చదువుకొందురు.
మా బడి ప్రకృతి ఒడి.
మా బడికి
జామ చెట్టు వచ్చింది
జామకాయలు ఇచ్చింది
ఆకలి తీర్చింది.
చక్కగా చదువుకుంది.!
మా బడికి
దానిమ్మ చెట్టు వచ్చింది
కాయలతో కడుపు నింపింది
కష్టపడి చదువుకుంది.!!
మా బడికి
బాదం చెట్టు వచ్చింది
బాదంపాలు ఇచ్చింది
బాగా చదువుకుంది.!!
మా బడికి
సీతాఫల్ చెట్టు వచ్చింది
ఫలాలు ఇచ్చింది
పిల్లల ఆకలి తీర్చింది.
కలిసి చదువుకుంది.!!
========================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి