మా బడి-4: -సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.


గుడి లాంటి 
మా ఖానాపూర్ బడిలో 
విద్యా దేవి కొలువై ఉన్నది. 

ఆమె నీడలో 
పిల్లలు ఎందరో 
విద్యాబుద్ధులతో ఎదుగుతున్నారు. 
పచ్చని ప్రకృతి ఒడిలో. 

మా బడికి 
గులాబీ పువ్వు వచ్చింది 
పరిమళాలు తెచ్చింది 
సరస్వతి మెడలో కూర్చుంది 
చదువై మెరిసింది. 

మా బడికి 
మల్లెపువ్వు వచ్చింది 
సుగందాన్ని తెచ్చింది 
సరస్వతి తలలో ఒదిగింది 
చదువులో ఎదిగింది. 

మా బడికి 
లిల్లీ పువ్వు వచ్చింది 
సరస్వతి  ఒడిలో చేరింది 
చక్కగా చదువుకుంది. 

మా బడికి 
మందార పువ్వు వచ్చింది 
అందంగా నవ్వింది 
సరస్వతి మదిలో చేరింది 
మంచిగా చదువుకుంది. 
===============================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
కామెంట్‌లు