మరుగున పడిన మగువలు61: - అనువాదం...అచ్యుతునిరాజ్యశ్రీ


 డా.కె.జానకిగారి Role of women infreedom struggle in Andhra Pradesh
ఆరుట్లకమలాదేవి1920లో పుట్టారు.తల్లిదండ్రులు లక్ష్మీనరసమ్మ, పి.వెంకట్రామిరెడ్డి.భర్త రామచంద్రారెడ్డి.మాడపాటి వారు ఇతరులు స్థాపించిన బడిలో మెట్రిక్ వరకు పెళ్లిఐనాక  చదివారు.ఆర్యసమాజ్ ,ఆంధ్ర మహిళాసభలలో పాల్గొనేది.కొలనుపాక లో విరాళాలతో ఆడపిల్లల బడి నెల కొల్పింది.నిజాంజులుంతో అది మూతబడింది.1942దాకా జైనమందిరంలో బడి నడిచింది.60పైగా విద్యార్థినులు,వారితల్లులతో హైదరాబాద్ వెళ్లి నిజాం నిరంకుశత్వాన్ని ఎండగట్టారు. రెండో ప్రపంచ యుద్ధ టైంలో విజయవాడ లో  డా.అచ్చమాంబ దగ్గర  శిక్షణ పొంది మద్యపానంకి వ్యతిరేకంగా ఊరేగింపులు ,వయోజనవిద్య, తరతరాల బానిసత్వం,అన్యాయార్జన, పన్నుల బాధపై పోరాటం చేసింది.గొరిల్లాపోరాటంలో తర్ఫీదుపొంది రజాకార్ల నిజాంకి ఎదురు తిరిగింది.రజాకార్లు ఆమె ఇల్లుని లూటీ చేశారు.పోలీసుయాక్షన్ తర్వాత  అండర్ గ్రౌండ్ లో ఉండి1949లో అరెస్టయింది.రెండున్నర ఏళ్లునల్గొండ వరంగల్, సికింద్రాబాద్,ఔరంగాబాద్ లో ఉండి ఖైదీల సమస్యాపరిష్కారానికి నిరాహార దీక్ష చేపట్టింది.1951లో రిలీజైంది. ఎం.ఎల్.ఎ.గా ఆలూరు నుంచి గెలిచినది.1952_1967దాకా ఆమె తన సత్తాచాటారు.ఫ్రీడం ఫైటర్ గా ఆమెకి పెన్షన్  ఇచ్చిందిప్రభుత్వం.మల్లు స్వరాజ్యం 1931లో కొత్త గూడెంలో పుట్టారు.చుక్కమ్మ రామిరెడ్డి ఆమె తల్లిదండ్రులు.భూస్వాముల కుటుంబంనించి వచ్చినా  అందరితో బాల్యంలోనే కలిసిపోయిన స్వభావం.నిజాం రజాకార్లకు చుక్కలు చూపింది.తెలంగాణ ఉద్యమంలో కోయజాతివారికి ఉత్సాహప్రోత్సాహాలిచ్చింది.ఇంటికొచ్చి చదువు చెప్పే ట్యూటర్ వద్ద ఆమె చదివారు.నిజాం కాలంలో ఆడపిల్లలకి బడులు లేవు.
స్వరాజ్యం కమ్యూనిస్టు పార్టీ లో చేరారు.ఆమె సోదరి శశిరేఖ ప్రేరణ ఉంది.తల్లి శిక్షణ కోసం విజయవాడ పంపింది.తన 16వ ఏటనే వాగ్ధాటితో సమాజంలోని దురాచారాల్ని ఎండగట్టింది.గొప్ప వక్త. నిజాంరాష్ట్రంలోని రజాకార్ల ఆగడాలు,భూస్వాముల  జులుంని దులిపేసింది. రజాకార్లు ఆమె ఇంటిని తగలబెట్టారు.తను సొంతంగా రాసి బాణీకట్టిన పాటలతో జనాల్లో ఉత్సాహం ఉద్రేకం రేపింది.ఆటవికుల పై దృష్టి పెట్టింది.అక్క చెల్లెళ్లు  ఇద్దరూ గుర్రాలెక్కి  కొండప్రాంతాల్లో తిరుగుతూ ,పోలీసుల పై దాడి చేసి ఆయుధాలు లాక్కునేవారు.అడవిజాతి స్త్రీలకు  ఆయుధాలను ఉపయోగించటంలో  శిక్షణ నిచ్చేవారు.గోదావరి అటవీప్రాంతంలో 3ఏళ్లు నిజాం రజాకార్ల కి కంట్లో నలుసులాగా తయారైంది.జోనల్ ఆర్గనైజర్ గా, ఏరియాకమిటీమెంబర్ గా గుణదల సెంటర్ లో కోయవారికి శిక్షణ ఇచ్చింది.కూలినాలీలు, బడుగు బలహీన వర్గాలకు చేయూత నిచ్చింది.ఆమె 6ఏళ్లు అండర్ గ్రౌండ్ లో  ఉంది.ఆమెను పట్టించిన వారికి బహుమతి ప్రకటించారు.ధనిక భూస్వాముల కుటుంబం నుంచి వచ్చిన ఆమె సరైన తిండి తిప్పలు లేక ఖాయిలా పడింది.1954లో కమ్యూనిస్టు లీడర్ ఎం.నర్సింహ్మారెడ్డిని పెళ్లాడింది.తుంగతుర్తి నుంచి ఎం.ఎల్.ఎ.గా ఎన్నికై  అసెంబ్లీలో  స్త్రీల హక్కులు,వారిపై జరిగే అన్యాయాలకు పోరాడేది. మద్య నిషేధం పై పోరాడింది 1945_47దాకా స్టేట్ మహిళాసంఘం అసిస్టెంట్ గా,కోయజాతివారికోసం  వరంగల్ కరీంనగర్, ఆదిలాబాద్  జిల్లాల్లో  పనిచేసింది.1970_78 వరకు సూర్యాపేట  పంచాయతీ సమితి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారామె🌷
కామెంట్‌లు