రాత్రి 11 గంటల సమయంలో వరిచేనుకు కావలి పండుకున్న పర్షయ్య చెవికి దాహం దాహం అనే మాట చిన్నగా వినబడుతుంది. నిద్రమత్తులో ఉన్న పర్షయ్య పట్టించుకోలేదు. అదే శబ్దం మళ్లీ మళ్లీ వినబడుతుంది. పర్షయ్య లేచి కూర్చున్నాడు. ఈ రాత్రి ఎవరయి ఉంటారా! అనుకుంటుండగానే మళ్లీ నిద్ర వస్తుంది. 'అది యాసంగి దినం ఎండలు మెండుగా కొడుతున్నాయి. పొలము సరిగ్గా పారకపోవడంతో పొద్దంతా పొలంవద్దే ఉండి నీళ్లు పారిస్తున్నాడు కాబట్టి పర్షయ్య, అలసిపోయి ఉండడం వలన నిద్రమత్తులో ఉన్నాడు. కళ్ళు తుడుచుకొని ఆ శబ్దం వినబడుతున్న వైపు నడుస్తున్నాడు. తన పొలం పక్కన పెద్ద పరుపుబండ ఉన్నది. అక్కడికి చేరుకోగానే అక్కడ ఓపదిహేడు యేండ్ల అబ్బాయి పడుకొని ఉన్నాడు. మళ్ళీ దాహం అనగానే పర్షయ్య తన మంచం దగ్గరకు వెళ్ళి, నీల్ల డబ్బ తీసుకొని వెళ్ళి, కొన్ని తాగించి, కొన్ని అతని ముఖం మీద చల్లాడు. కొద్దిసేపటికి మెల్లగా లేవగానే పర్షయ్య తనను పట్టుకొని వచ్చి తన మంచంలో కూర్చుండబెట్టి అతని వివరాలు అడిగాడు.
నా పేరు నితిన్, నేను పలాన వాళ్ళ అబ్బాయినని చెప్పగానే పర్షయ్య ఇంటికి ఫోన్ చేసి, నితిన్ వాళ్ళ నాన్నకు విషయం చెప్పుమని తన కొడుక్కు చెప్పాడు. 'నితిన్ పట్నంలో ఇంటర్ చదువుతున్నాడు. పరీక్షలు అయిపోవడంతో ఇంటికి వచ్చాడు. తన స్నేహితులు నలుగురితో పాటు కలిసి మద్యం సేవించడానికి ఊరికి దూరంగా ఉన్న ఆ బండపైన కూర్చొని చిత్తుగా మద్యాన్ని సేవించారు. మద్యం మత్తులో ఏదో చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకోని, కొట్టుకొని నితిన్ ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు స్నేహితులు'. "ఈ మద్య యువకులు మద్యం సేవించడం ఎక్కువైంది".
అప్పటికే నితిన్ రాలేదని ఎదురు చూస్తున్న తల్లితండ్రులు విషయం తెలుసుకొని పర్షయ్య వాళ్ళ పొలం దగ్గరకు పరుగెత్తి, తన కొడుకును చూసి బోరున ఏడ్చారు. మీరు ఇక్కడ లేకుంటే నా ఒక్కగానొక్క కొడుకు దక్కకుండా పోయేవాడని పర్షయ్యకు కృతజ్ఞతలు చెప్పి, ఇంటికి తీసుకవెళ్ళి, స్నానం చేయించి, డాక్టర్ తో వైద్యం చేయించి, పెరుగన్నం తినపెట్టి పడుకొ బెట్టి, తెల్లవారే వరకు జాగ్రత్తగా చూసుకున్నారు నితిన్ వాళ్ళ తల్లిదండ్రులు.
తెల్లారింది నితిన్ లేచి కూర్చున్నాడు. వాళ్ళనాన్న దగ్గరి మిత్రుడైన మురళిధర్ అనే ఉపాధ్యాయుడిని ఇంటికి పిలిపించాడు. ఆ ఉపాధ్యాయులు చూడు నితిన్ నీవు మీనాన్నకు ఒక్కగానొక్క కొడుకువు వాళ్ళ ఆశలన్నీ నీమీదె అందుకే పెద్ద చదువులు చెప్పించాలని పట్నంలో వేస్తే ఇదా నీవు నేర్చుకుంది. ఒకవేళ నీకేమైనా అయితే వీళ్ళ పరిస్థితి ఏంటని, ఇంత చిన్న వయసులో మద్యం సేవిండమేమిటి. దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది కదా అంటూ నితిన్ కు మంచిమాటలు చెబుతుంటే, నితిన్ కనుల వెంబడి నీరు జలపాతంలా కారుతున్నాయి. లేచి వెంటనే అమ్మా నాన్నల కాళ్ళమీద పడి భోరున ఏడ్చాడు. అప్పుడు వాళ్ళ అమ్మ పైకి లేపి ఏడ్చుకుంటూ హత్తుకుంది. నితిన్ నిజం తెలుసుకొని, నేను జన్మలో మద్యం సేవించనని, మీరు చెప్పినట్టె వింటానని ప్రమాణం చేశాడు. అప్పుడు ఎలాంటి వారితో స్నేహం చేయాలో తెలుసుకొని, మంచి వారితో ఉంటేనే జీవితంలో ముందుకెళ్ళగలవని మాష్టారు వెళ్ళిపోయాడు. కూమారున్ని మార్చినందుకు తండ్రి తన స్నేహితుడికి కృతజ్ఞతలు చెప్పాడు. నితిన్ నాలుగు రోజులు ఉండి, పట్నం వెళ్ళి చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి, అందరితో కలిసి మెలిసి హాయిగా ఉన్నాడు.
నీతి: మద్యం మనిషిని ఎంతటికైనా దిగజార్చుతుంది మద్యానికి దూరంగా ఉండటం మంచిది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి