ఎర్రవళ్లి గ్రామంలో నవీన్,సురేష్ మంచి స్నేహితులు.నవీన్ ప్రభుత్వ పాఠశాలలో చదివి క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు.సురేష్ ప్రైవేట్ పాఠశాలకు వెళ్లి ఎప్పటికీ తరగతులో వెనుకబడి పోయేవాడు.ఒకరోజు సురేష్ వాళ్ళ ఇంటికి నవీన్ వస్తాడు.సురేష్ నీకు పరీక్షలో ఎన్నిమార్కులు వచ్చినాయిరా!
ఒరేయ్ నవీన్! గట్టిగా అరవకురా!మా అమ్మ నాన్నలు వింటారు.నన్ను కోప్పడుతారు. అప్పుడు సురేష్ మెల్లగా ఇంటి వెనకాలకు తీసుకెళ్లి ఇలా అంటాడు.నేను పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను.అందుకే బాధగా ఉందిరా!
మరి నీవురా!నేనా..రా.. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాను. రోజునీవు చదువుకోలేదా.. రా అని నవీను అంటాడు.లేదురా అశ్రద్ధ చేశాను.అయితే రోజు మా ఇంటికి రారా మంచిగా నువ్వు నేను కలిసి చదువుకుందాం అని నవీన్ అంటాడు.అర్థం కాని విషయాలు నేను చెప్తాను అని అంటాడు.సరేరా నవీన్!
నేను రేపటినుండి మీ ఇంటికి వస్తారా! పక్క పక్కనే కూర్చొని కలిసి చదువుకుందాం రా అని సురేషు అంటాడు.
సరే రారా అని నవీన్ ఇంటికి వెళతాడు.సురేష్ కొద్దిసేపటికి నవీన్ ఇంటికి వచ్చి చదువుకుందామని పుస్తకాలు తెరిచి చదువుమొదలు పెడతారు.సురేషు వాళ్ళ నాన్నగారి ఫోన్ తీసుకొచ్చి పుస్తకంలో పెట్టి చూస్తున్నాడు.
ఒరేయ్ సురేష్ పోన్ చూడద్దురా!కండ్లు పోతాయి! మరియు చదువు మీద ధ్యాస వుండదు.అందుకే నువ్వు పరీక్షలలో ఫెయిల్ అయితున్నావురా?
ఎప్పుడు ఫోన్ చూడొద్దు రా నేను చెప్పినట్టు వినురా అని నవీను అంటాడు.
సురేష్ ఇలా అన్నాడు.సరే లేరా మరి నాకు ఫోన్ చూడంది మనసుకు పట్టదురా! అందుకే నేను ఫోన్ చూస్తారా అని సురేష్ అంటాడు.ఒరేయ్ నేను నీకు అర్థం కానీ విషయాలన్నీ చెప్తాను.ఫోన్ మాత్రంచూడనని నామీద ఒట్టువేయిరా అని నవీన్ అంటాడు.ఒద్దురా అలా ఒట్టు వేయించుకోవద్దురా! అని సురేష్ అంటాడు.ఫోన్ బంద్ చేస్తా నాకు అర్ధంకాని విషయాలు చెప్పురా! అని సురేషు అంటాడు.కాసేపు ఇద్దరు కలిసి ఒక చెట్టు కింద కూర్చొని హాయిగా నిశ్శబ్దంగా చదువుకుంటారు.అప్పుడు నవీను వాళ్ళ అమ్మానాన్నలు పిలిచారు.నవీన్ నువ్వు ఇంటికి వెళ్తున్నావురా! అవున్రా నేను మళ్ళీ వస్తాను. నువ్వు ఇక్కడే ఉండి చదువుకో!అని వెళ్లి పోతాడు.ఇలా చాలా రోజులు నవీన్ చెప్పినట్లుగా వింటాడు. ఇద్దరూ పదో తరగతి పరీక్షలు రాయడానికి వెళ్లారు.ఇద్దరు కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు.నవీన్ పుణ్యమా అని నేను ప్రథమ శ్రేణిలో పాసైనాను. అప్పుడు సురేష్ నవీన్ వద్దకు వచ్చి చాలా చాలా ధన్యవాదాలు రా నువ్వు చెప్పినట్లుగా నేను చదువుకున్నాను మా అమ్మానాన్నలు నన్ను మెచ్చుకున్నారని సురేషు అంటాడు.అప్పుడు నవీన్ సరేలేరా!
మొత్తం మీద మనం ఇదే విధంగా కష్టపడి ఇంకా పై స్థాయిలో బాగా చదువుకోవాలి.
మనిద్దరం కూడా మంచి ఉద్యోగాలు తెచ్చుకుందాం రా అని నవీన్ అంటాడు.ఔనురా! ఇప్పటినుంచి మనిద్దరం ఇదేవిధంగా చదువుకుందామని చదువుల తల్లి సరస్వతీ దేవిమీద ఒట్టుపెట్టుకుంటారు.చదువులో పైకి వస్తారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి