నాన్న నీడ: - అరకోటి మైత్రి-10వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యొల-జిల్లా సిద్ధిపేట.-9704865816
 చిన్న మాసాన్ పల్లెలో చింతలులేని కుటుంబం అంటే నర్సింలు గారి కుటుంబమే అనేవాళ్ళు.భార్య కనక లక్ష్మి భర్తను,పిల్లలను కంటికి రెప్పలా చూసుకునేది. నాన్నకు పిల్లలంటే పంచప్రాణాలు.ప్రతిరోజు పాఠశాలకు పంపించే ముందు వారి తలలు నిమురుతూ బాగా చదువుకోండి బంగారు తల్లులారా! మీ భవిష్యత్తును వెలుగులా తీర్చిదిద్దుకోవాలని అని చెప్పేవారు.కార్ డ్రైవింగ్ చేసి సాయంత్రం ఇంటికి వచ్చేవారు.పిల్లలు హోంవర్క్ చేసుకునే వరకూ తోడుగా కూర్చునేవారు. ఏమైనా అర్థం కాని విషయాలు ఉంటే నాన్న ఓపికతో చెప్పేవారు.చిన్న కూతురు కావ్య మంచి పాటలు పాడేది.
నాన్న అలసిపోయి వచ్చినప్పుడు నాన్నకు సంతోషకరమైన పాటలు పాడేది.
అమ్మానాన్నల కష్టం చూస్తూ ఇద్దరు అమ్మాయిలు బాగా చదువుకునేవారు.ప్రతిరోజు నాన్న కారు డ్రైవింగ్ కు వెళ్తున్నపుడు పిల్లలకు బుద్ధి మాటలు చెప్పేవారు.
మంచిగా చదువుకోవాలి.అమ్మను విసిగించకూడదు. మీరు భవిష్యత్తులో గొప్ప వారిగా ఎదగాలి అని చెప్పి,కార్  డ్రైవింగ్ కు బయలుదేరేవాడు.అలా రోడ్డు పక్కన కారు ఆపి ఫోన్ మాట్లాడుతున్నారు.
వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి కారును ఢీ కొట్నటడంతో నర్సింలు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆసుపత్రికి తీసుకుపోయేలోపే నర్సింలు చనిపోయాడు.ఈ విషయాన్ని విన్న భార్య కనకలక్ష్మి,నందిని, కావ్యలు తట్టుకోలేకపోయారు.నాన్న వద్దకు వచ్చి లేనాన్న మీరు లేవాలి...నాన్న మాతో మాట్లాడాలే. అంటూ గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరై ఏడ్చారు.మేము దిక్కులేని పక్షులమైపోయాము నాన్న అని విలపించారు.వారికి సొంత ఇల్లు కూడా లేదు. తాతగారి ఇంటి వద్దనే ఉండిపోయారు.ఆస్తులు ఏమీ లేవు.అమ్మ బీడీలు చేస్తూ, పనికి వెళ్తూ ఇద్దరు పిల్లలను మంచిగా చదివించేది.
పెద్ద కూతురు నందిని మంచిగా చదువుకొని బీటెక్ చేసి విదేశాలకు వెళ్లి స్థిరపడింది.అమ్మకు డబ్బులు పంపుచుండేది.చెల్లికావ్యను బాగా చదివించాలి.
ఎంతడబ్బైనా నేను పంపిస్తాను అని చెప్పేది. 
ప్రతి విజయానికి ముందు ఒకసారి ఆకాశం వైపు చూసి నాన్న మీ ఆశీర్వాదం వల్లనే మేమింత గొప్పవారిమయ్యామని చెప్పుకునేవారు.తండ్రి శారీరకంగా దూరమైన ఆయన ప్రేమ పిల్లల జీవితంలో ఎప్పటికీ వెలుగుగా నిలిచింది.
చిన్న కూతురు మాత్రం కష్ట పడి ఇక్కడే టీచర్ ఉద్యోగం సంపాదించుకొన్నది.అమ్మకు ఒక మంచి ఇల్లు కట్టించి అమ్మను పువ్వుల్లో పెట్టి చూసుకునేది.చదువును నమ్ముకున్నవాళ్లు ఎన్నడు చెడిపోరని నిరూపించారు.

కామెంట్‌లు