బడి మొగ్గలు: - - డా.భీంపల్లి శ్రీకాంత్- 9032844017
సుతిమెత్తగా నడిచే పాదాలకు చెప్పులు లేకున్నా
చదువు ప్రయాణం సాగించే నిత్య బాటసారులు
పాఠశాలంటే పిల్లలకు నీడనిచ్చే చల్లని తల్లి

నకనకలాడే కడుపులతో పాఠశాలకు వచ్చినా
గురువుల బోధనతో విద్యార్థుల కడుపు నిండేది
మధ్యాహ్నభోజనమే విద్యార్థులకు అమృతఫలం

గణగణమంటూ పిలిచె బడిగంటతో చైతన్యులై
పరుగుపరుగునా వచ్చే సీతాకోకచిలుకలు
విద్యార్థుల సందడితోనే పాఠశాలలో వసంతం

బడిలో పలకల మీద అఆలు చక్కగా దిద్దుతూ
జీవితాన్ని మలుచుకునే భవిష్యత్తు తారకలు
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాది బడి

చకచకా బడికి వెళ్ళి గురువుకు దండం పెట్టి
చదువును బాగా చదివే పసిడి మొగ్గలు
అమ్మవడిలాంటి బడిలో అక్షరాలను దిద్దేది చిన్నారులు


కామెంట్‌లు