రాము ఒక పేద కుటుంబానికి చెందిన బాలుడు.అతను చాలా బాగా చదువుకునేవాడు.దీపావళి పండుగ వచ్చింది.పిల్లలంతా కొత్త బట్టలు ధరించి బాణాసంచా తెచ్చుకుని ఆనందంగా గడుపుతున్నారు.
కానీ రాము ఇంట్లో పరిస్థితి అంత మంచిగా లేదు. అతని నాన్న జ్వరం, దగ్గుతో మంచం పట్టాడు.అమ్మ ఇంటి ఖర్చుల కోసం కష్టపడుతోంది. ఈ పరిస్థితిలో కొత్త బట్టలు అడిగి అమ్మను బాధ పెట్టడం రాముకు ఇష్టం లేదు.
దీపావళి రోజు రాము పాత బట్టలే వేసుకుని గుడికి వెళ్లాడు. కొత్త బట్టలు ధరించిన కొందరు పిల్లలు అతన్ని చూసి నవ్వారు. రాముకు చాలా బాధ కలిగింది. మౌనంగా ఇంటికి వచ్చి ఒక మూలన కూర్చున్నాడు.
అప్పుడతను తన నానమ్మ దగ్గరకు వెళ్లాడు.
“నానమ్మా! దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటాం?” అని అడిగాడు.
నానమ్మ చిరునవ్వుతో చెప్పింది.
"శ్రీరాముడు రావణాసురుడిని సంహరించి, సీతాదేవితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలంతా ఆనందంగా దీపాలు వెలిగించారు. అందుకే దీపావళిని వెలుగుల పండుగ అంటారు.”
“అంటే దీపావళి కొత్త బట్టల కోసం కాదు కదా నానమ్మా?” అని రాము అడిగాడు.
“కాదు బాబూ!మనసులో ఆనందం,పెద్దల ఆశీర్వాదాలు ఉంటే అదే నిజమైన దీపావళి,”అంది నానమ్మ.
రాము సాయంత్రం ఇంటి ముందు చిన్న మట్టి దీపం వెలిగించాడు.నాన్న,అమ్మ, నానమ్మతో కలిసి దేవుడిని ప్రార్థించాడు. ఆ రోజు అతని హృదయం ఆనందంతో నిండిపోయింది.
కొన్ని నెలల తర్వాత నాన్న ఆరోగ్యం పూర్తిగా మెరుగైంది. కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు.మరుసటి సంవత్సరం దీపావళి వచ్చినప్పుడు రాము కుటుంబమంతా కొత్త బట్టలు ధరించి, దీపాలు వెలిగించి, మిఠాయిలు పంచుకొని ఎంతో సంతోషంగా పండుగ జరుపుకున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి