అమ్మను నేను
పిల్లలు నన్నూ అనుకరించి
అనుసరించి సాగడమే
బతుకు మూలం
అడుగులో అడుగే అనుకరణ భావచిత్రం
అప్పుడప్పుడు తెగిన గాలిపటాల ఆట సరే సరి...
బడికి పోతే పంతులు
ఊపే కర్రలో క్రమశిక్షణ
అనుకరణమెట్లే కొనసాగే యాత్ర
ఉచ్ఛారణ దోషంలేని వల్లెవేతలో
అక్షరశుద్ది బుద్ధిగా
నాలో పలికించిన నాన్న కటువు మాటే చదువు కొనసాగింపు
ఇక అమ్మ
నింగి ఆకాశం నిప్పూ నీరు గాలి
అన్నీ కలెగలిసిన మిశ్రమం
పోపు డబ్బాలో వాసన చుట్టేసే పహచాన్
ఎన్ని దశాబ్దాలుగా అలుపెరుగని నది నడకలా అనుసరించి సాగుతుందోగానీ
తరాలెన్ని మారినా అంతంలేని అనుకరణే రహదారి ఆలాపన ...
మంచీ చెడు వినిపించేదే గమన గాధ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి