పెద్దల మాటలు సద్ది మూటలు : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
పెద్దల మాటల్లో 
వారు చూపు త్రోవలో 
మేలు దాగుంటుంది 
భవిత బాగుంటుంది 

గురువుల గద్దింపులు 
వారు చేయు బోధలు 
బాగు చేయుబ్రతుకులు 
చక్కదిద్దు నడతలు 

అభివృద్ధికి బాటలు 
పరిమళించు తోటలు 
కన్నవారి మాటలు 
మమకారపు కోటలు 

పెద్ద వారి పలుకులు 
చూడ సద్ది మూటలు 
తొలకరి చిరు జల్లులు 
విరిసిన మరు మల్లెలు 

మేలు కోరు మిత్రులు 
ఉన్న వారు ధన్యులు 
వారు కదా సోదరులు 
ఇల శ్రేయోభిలాషులు 


కామెంట్‌లు