గోరంత దీపం: - జి.దీపిక-9వ,తరగతి-జి.ప.ఉ.పా.రామంచ-మం:చిన్నకోడూరు-జి.సిద్దిపేట
 ఇచ్చాపురం లో ఒక రాము చిన్న గ్రామం, ఆ గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. వారి ఇంట్లో కరెంటు తరచూ పోయేది. రాము రాత్రిళ్ళు చదవాలని అనుకునేవాడు. కానీ వెలుగు లేక ఇబ్బంది పడేవాడు. ఒకరోజు అతను పాత సీసా, కొద్దిగా నూనె,పత్తితో చిన్న దీపం తయారు చేశాడు .ఆ దీపం వెలుగులో ప్రతిరోజు చదవడం మొదలు పెట్టాడు. గ్రామంలోని పిల్లలు కూడా అతని దగ్గరకు వచ్చి చదవడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత గ్రామ పెద్దలు చూసి ఆశ్చర్యపోయారు. "చిన్న దీపం ఎంతమందికి వెలుగు ఇచ్చిందో చూడండి!" అంటూ ఊరి యజమాని ప్రజలు అన్నారు. రాము రోజురోజుకీ ఎదిగి పై చదువులు చదివి మంచి అధికారి అయ్యాడు. తన గ్రామానికి పెద్ద లైబ్రరీ కట్టించాడు. చిన్నప్పటినుండి ఊర్లో ఉన్న సమస్యలు చూసి ఎంతో బాధపడేవాడు. ఊరికి ఏదో విధంగా సహాయ పడాలని అనుకున్నాడు. కనుక ఊర్లో విద్యుత్ లేక అందరూ చీకటిలో బతుకుతున్నారని, విద్యుత్తు్ తన ఊరికి అందించాడు. అందరూ రామును ఎంతో ప్రశంసించారు. రామును అందరూ ఆదర్శంగా తీసుకొని అతనిలానే పేరు పొందారు. అప్పుడు ఊరు చాలా సంతోషించింది.

కామెంట్‌లు