రైతు: - యస్.హిందు-9వ,తరగతి-జి.ప.ఉ.పా.రామంచ-మం:చిన్నకోడూరు-జి:సిద్దిపేట
 సూర్యోదయం నుండి సూర్యాస్తమయంతో
ఆగని ఆవేదన నీకు ఉందన్న
ఆకలిని తీర్చేటి, అన్నదాతవు నీవన్న
అంతులేని ఆరాటంతో  నీవన్న
కష్టాన్ని దిగమింగే కర్షకుడు నీవన్న
ఆకలిని చంపుకున్న ఆది మానవుడు నీవన్న
నెత్తురు చెమటతో నేలను చూసేది నీవన్న
భుజాన నాగలితో భూమిని దున్ని నడిపేది నీవన్న
మూడు రుతువుల్లో ఉప్పులెన్నో పడుతూ శ్రమించేది నీవన్న
పైరు పంటలే అమ్మఒడిగా ప్రాణం పోస్తివి విత్తనాలకు నీవన్న
వ్యవసాయమే నీ వ్యవస్థని
వెలిగితివి దేశానికి వెన్నెముకల నీవన్న

కామెంట్‌లు