ఆ కౌశికుడు ఉత్తర దిశయందున్న
హిమావత్పర్వతమునకు వెళ్ళి
నిష్టతో తీవ్రముగా తపస్సు చేయగా
వెయిసంవత్సరములు గడిచెను
ఆ తపస్విని చూసి దేవతలందరూ
భయభ్రాంతికి లోనైనారు
దేవతలెల్లరు ఋషీశ్వరులతోగూడి
బ్రహ్మ వద్దకు వెళ్ళినారు
కౌశికుడు మహర్షి బిరుదము పొందుటకు
ఎంతవరకు అర్హుడు అని బ్రహ్మనడిగినారు
బ్రహ్మ దేవతుల మాటలను విని
విశ్వామిత్రుని వద్దకు వచ్చినాడు
నీ తపస్సును నే మెచ్చితినయ్యా
నా తపస్సు మెచ్చి మహర్షిత్వమిచ్చారు
నేను జితేంద్రియనైనట్లుగా భావింతును
ఇంత మాత్రానికే జితేంద్రుడవు కాలేవని
బ్రహ్మ అతనికి చెప్పి వెళ్లిపోయినాడు
విశ్వామిత్రుడు గాలిని ఆహారంగా పొంది
ఎండ,వాన,చలి అనకుండా అతడు
నీటిలోనుండి రాత్రింబవళ్లు
తపస్సొనర్చును
తపస్సు భంగముకై దేవేంద్రుడు రంభనంపును

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి