వావిలాల గోపాలకృష్ణయ్య సిసలైన గాంధేయవాది

 వావిలాల నిరాడంబరత, ప్రజా ఉద్యమాలు నేటి తరానికి అనుసరణీయం
బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వహించిన మహోన్నతుడు
విగ్రహావిష్కరణ సందర్భంగా వక్తల అభిభాషణ 
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య సిసలైన గాంధేయవాది అని, ఆయన జీవితం ఆదర్శనీయమని, ఆయన బాట అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. కొమ్ము వెంకటస్వామి నాయుడు, కళ్యాణి దంపతుల జ్ఞాపకార్ధం వీరి కుమారుడు కొమ్ము రమణమూర్తి, హింస వేణి దంపతులు నెలకొల్పిన స్వాతంత్ర్య సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య విగ్రహావిష్కరణ బుధవారం ఉదయం శ్రీకాకుళం గాంధీ మందిరం, స్వాతంత్ర్య సమరయోధుల సంఘ సంస్కర్తల తేజోమూర్తుల స్మృతి వనంలో జరిగిన సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. సెట్ శ్రీ విశ్రాంత సీఈవో సురంగి మోహన రావు, విగ్రహ దాతలు సంయుక్తంగా విగ్రహావిష్కరణ చేసిన అనంతరం వావిలాల గోపాలకృష్ణయ్య స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి, స్వాతంత్ర్య అనంతరం ప్రజా సమస్యలపై జరిపిన నిరంతర పోరాటం, నిరాడంబరతతో సాగిన ఆయన జీవితం, చివరి రోజు వరకు ఆయన అనుసరించిన గాంధేయవాదం గూర్చి వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమం లో జామి భీమ శంకరరావు, బరాటం లక్ష్మణరావు, ఎం వి ఎస్ ఎస్ శాస్త్రి, నిష్టల నరసింహ మూర్తి, పైడి హరనాధ రావు, వెంకటరావు, గుత్తు చిన్నారావు , మహిబుల్లాఖాన్ ఖాన్ , చౌధరి రాధాకృష్ణ, నక్క శంకర రావు, పెంకి చైతన్య కుమార్,పి అప్పారావు, పొన్నాన రవి కుమార్, అనంత భట్లు, జి నాగేశ్వరరావు, గేదెల ఇందిరా ప్రసాద్, గేదెల లక్ష్మీ పాల్గొన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాభిషేకం చేసారు. అనంతరం గాంధీ మందిరంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి రఘుపతి రాఘవ గీతాన్ని సామూహికంగా ఆలాపించారు. విగ్రహ దాతలు కొమ్ము రమణమూర్తి కుటుంబ సభ్యులకు గాంధీ మందిరం తరపున ఘనంగా సన్మానించారు.
కామెంట్‌లు