విశ్వామిత్రుడు మేనకను చూసి మరలుగొనుట : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు 
పుష్కర క్షేత్రమునందు
వేయి సంవత్సరములు తపమాచరించగా
ఆమునికి తపఃఫలము ప్రసాదించుటకు

దేవతలందరూ అచటికి విచ్చేసినారు
మహాతేజస్వియైనా బ్రహ్మ దేవుడు 
విశ్వామిత్ర నీకు శుభము కలుగును 
శుభకర్మలతో ఋషిత్వమును పొందితివి 

విశ్వామిత్రుడు మళ్లీ తపమాచరించుగా
అప్సరసలలో మేటియైన మేనకను 
పుష్కర తీరమునకు పంపినారు 
విశ్వామిత్రుడు చూసి ముగ్దుడైనాడు

విశ్వామిత్రుడు పదిలక్షల సంవత్సరములు 
ఆమెతో సుఖముగా గడిపినాడు
తపస్సు బంగమైన సంగతి గుర్తుకొచ్చి 
విశ్వామిత్రుడు మిక్కిలి చింతించినాడు 

పశ్చాత్తపముతో దుఃఖితుడైనాడు 
మేనక భయముతో అచట నిలువగా
నీ తప్పు ఏమి లేదు నేనే తప్పు చేశాను 
విశ్వామిత్రుడు మేనకతో పలికినాడు


కామెంట్‌లు