తపోదీక్షలోనున్నావిశ్వామిత్రుని
కామమోహంలోకి ప్రలోభ పెట్టి
దేవతలకు హితము గూర్చు రంభా
దేవేంద్రుని మాటలిని రంభ భీతి చెంది
ఓ దేవేంద్ర విశ్వామిత్రుడు ముక్కోపి
నేనతని తపసుభంగము చేసినచో
అతడు తన కోపానికి గురి చేస్తాడు
అప్పుడు నన్ను మీరే రక్షించాలి ఇంద్రా
ఓ రంభా భీతి చెందకు నీకు నేనున్నాను
నీవు అందమైన రూపము ధరించి
విశ్వామిత్రుని చలింప జేయుము
దేవేంద్రుని మాటలిని రంభ వెళ్ళింది
అందమైన రూపు దాల్చి ఆ మునిముందు
చిరునవ్వులతో చిందులు వేస్తుంది
ఆమెను చూసిన విశ్వామిత్రుడు
ఇంద్రుడు పంపినదిగా తెలుసుకుంటాడు
ఇంద్రుని పన్నాగము తెలుసుకుని
విశ్వామిత్రుడు రంభను శపిస్తాడు
నీవు పదివేల సంవత్సరములు
భువిపై శిలవై పడియుండుమని శపిస్తాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి