శుభాకాంక్షలు : - డా. అరుణ కోదాటి-అరుణోదయ సాహితీ వేదిక - హైదరాబాద్
నల్గొండ జిల్లా ముద్దు బిడ్డ 
 మణిరత్నమై  మెరుస్తుండగా 
అందరి అభిమానాన్ని  చూర గొంటున్న డా.ఏనుగునర్సింహా రెడ్డి గారు.
 వృత్తి పట్ల అంకిత భావం,
సాహిత్యo పట్ల అభిమానంతో 
  రెండూ సమానంగా  నిర్వహిస్తున్న ఆదర్శ వాది నర్సింహా రెడ్డి గారు.

వృత్తి లో నిబద్దత,గాంభీర్యం,
సాహిత్య వేదికల పైన  అలుపెరుగని విజ్ఞాన ఉపన్యాసం,
 మాటల్లో నమ్రత,
ఆప్యాయతతో కూడినపలకరింపు,స్నేహశీలి.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే 
వినయశీలి.
 తన రచనల్లో  వాస్తవికత,
గ్రామీణ జీవనానికే పెద్ద పీఠం అతని మనస్సులో,
 స్వీయ జీవిత మూలాలను 
మరిచి పోని,
 పనిలో శ్రమైక జీవి.
ఇవే అతని  ఎదుగులకు  
కారణాలంటాను.

పద్యం, కవిత, రుబాయిలు,
 కథలు ఏవి అతని కలంనుండి  జాలువారినా. 
అతని  మదిలోని భావం
సామాన్య ప్రజల ప్రస్తుత 
జీవన  స్థితి గతులే.అతని ధ్యేయం
 అన్యాయాన్ని ఎదిరించడం,
 న్యాయo కొరకు పోరాడడం.

  నూటికో , కోటికో  పుడతారు.. అనే పాటను  ఒక కవి రాసినట్టు 
 కొద్దిమంది మాత్రమే  ప్రజల మనిషి అవుతారు.
అందులో ఒకరే    తెలంగాణా బాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు,  ఇటీవలే  IAS   హోదాను  పొంది 
ఆ  హోదాకే  వన్నె  తెస్తున్న  
డా.ఏనుగు నర్సింహా రెడ్డి గారు.

వీరి సేవకు మెచ్చి ఎన్నో  పురస్కారాలు వీరిని  వరించినా
 నిన్ననే(  జూన్  7  )న  వరంగల్ లో సహృదయ సాహితీ  సంస్థ వారు అందించిన  " అవధాన  రారాజు " బిరుదు  డా. రాళ్లబండి  కవితా ప్రసాద్ గారి  స్మృతిలోసహృదయా నంద పురస్కారం అందచేయడం నర్సింహా  రెడ్డి గారు రారాజు గా, సహృదుయునిగా,
అన్ని విధాలా సరిపోయేట్టు  ఉండడం గమనార్హం.
 (  పురస్కారం అందుకున్న సందర్బంగా  శుభాకాంక్షలు సార్ )💐💐💐💐💐💐💐💐


కామెంట్‌లు