కాల్వశ్రీరాంపూర్ మండలం, ఊషన్నపల్లి ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాల కు అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ డాక్టర్ ముస్కు సంపత్ పదివేల రూపాయల విలువైన నీటి ట్యాంక్ (వాటర్ ట్యాంక్)ను కొనివ్వగా, బుధవారం గంగారం గ్రామ సర్పంచి రేకుల జ్యోతి చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యకు అందజేశారు. ప్రస్తుతం ఉన్న చిన్న నీటి ట్యాంకు రంధ్రాలు పడి కారుతోందని, పాఠశాల పిల్లల కోసం నీటి ట్యాంకు కొనివ్వాల్సిందిగా ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, డాక్టర్ ముస్కు సంపత్ ను కోరగా, ఆయన వెంటనే స్పందించారు. రూ.10 వేల విలువైన సింథటిక్ నీటి ట్యాంకును కొనిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ ముస్కు సంపత్ ను శ్రీరాంపూర్ తహసిల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచి, వార్డు సభ్యులు, విద్యా కమిటీ చైర్మన్, సభ్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, పలువురు అభినందించారు. డాక్టర్ సంపత్ సేవా భావానికి, మంచి మనసుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచి జ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్య బోధన జరుగుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆమె కోరారు. ఈ విషయంలో గ్రామంలోని పిల్లల తల్లిదండ్రులు అందరూ ముందుకు రావాలని కోరారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు చక్కని క్రమశిక్షణ, సత్ప్రవర్తన నేర్పించడంతోపాటు కార్పొరేట్ స్థాయికి దీటుగా ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చేర్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సర్పంచి రేకుల జ్యోతి, విద్యా కమిటీ చైర్మన్ పెండ్లిస్వరూప, వార్డు సభ్యులు ఆవుల సునీత తిరుపతి, కూస లతరాజు, ముసుకు అంజయ్య, ముష్కే కుమారస్వామి, బొజ్జ వెంకన్న, మిరియాల మల్లేష్, చిక్కుల వంశీ, న్యాయవాది కూస సతీష్, ధరణి మణికంఠాచారి, ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, ఎడ్ల స్రవంతి, బండారి సరిత, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు.
ఊషన్నపల్లి పాఠశాలకు నీటి ట్యాంకు కొనిచ్చిన డాక్టర్ సంపత్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి