"బడి గంట" ; "గగన తారలు" పుస్తకావిష్కరణలు

 నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న  విరచిత "బడి గంట" , "గగన తారలు" పుస్తకావిష్కరణలు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరులో ఘనంగా జరిగాయి. ఆ అధ్యయన కేంద్రం ప్రాజెక్టుడైరక్టరు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గంగిశెట్టి శివ కుమార్, గోవిందరాజు సుభద్రా దేవి మరియు విచ్చేసిన ప్రముఖుల చేతులు మీదుగా రెండు పుస్తకాలు ఆవిష్కరింపబడం విశేషం. అనంతరం బహు గ్రంథ గద్వాల సోమన్నను సత్కరించారు. ఈ కార్యక్రమంలో  ఆ సంస్థ సిబ్బంది,విద్యార్థులు ,  పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
కామెంట్‌లు