సుప్రభాత కవిత : - బృంద
ఆకాశవీధిలో అరుదైన దీపం 
మేఘాల దారిలో  బంగారు రూపం 
అవనిలో చైతన్యపు సెగ కలిగించి 
అలుపెరుగక నడిపించే ఆశాదీపం!

ఆశగా ఎదురుచూసి 
తనువును తపింపచేసి 
తలపుల మొలకలకు 
తడి అందించగా......

కనులు కన్న కలలకు 
కమ్మని ఆకృతినిచ్చి 
కరువుతీరా చూడాలనుకునే 
కసికి ఆజ్యం పోయగా.....

మనసు పొరల అడుగున 
మాటువేసిన మమతలకు 
మమకారపు రంగులద్ది 
మేలుకొలిపి  మురిపించగా....

మాటలతో ఆపేయక 
చేతలతో చూపించి 
చూపులకు ఆనేలా
విజయం అందించగా...

అంతరంగపు ఆలోచన 
ఆచరించి సాధించాలనే 
అలుపెరగని  ఆరాటాలకు 
ఆసరాగా వుండాలని....

వచ్చే కొత్త వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు