హలో పిల్లలూ! ముళ్ళ గోరింట పూలను చూశారా ! పసుపు, బంగారు వర్ణంతో ఉంటాయి. వీటిని గోల్డెన్ ఫ్లవర్స్ అనీ, బంగారు పూలు అనీ అంటారు. దీని శాస్త్రీయ నామం "బార్లీరియా ప్రియొనైటిస్". అకాంథేసి కుటుంబానికి చెందిన మొక్క. దీనికి చిన్నచిన్న ముళ్ళు ఉండటం వలన ముళ్ళ గోరింటలు అంటారు. ఇవి గంట ఆకారంలో ఉంటాయి. తెలుపు, ఎరుపు, పసుపు, నీలం రంగులలో లభ్యమవుతాయని బెంగుళూరు వెళ్ళాకే తెలిసింది. గులాబీ ఎరుపు రంగులో ఉన్న మళ్ళ గోరింట పూలు గార్డెన్లో ఉంటే కోసుకొచ్చాను. ఇంట్లో కుక్రవారం కావటాన గులాబీలు ఉన్నాయి. ఇది ఔషధ మొక్క. ఆయుర్వేదంలో వాడతారు. సంస్కృతంలో ‘‘వజ్రదంతి’’ అంటారు. చిగుళ్ళు, పళ్ళు వాపులకు, పుండ్లకు మందుగా వాడతారు. శివుడికి అత్యంత ప్రియమైన పూలు. కార్తిక మాసంలో ఎక్కువగా పూస్తాయి. పల్లెటూర్లలో ప్రతి ఇంటా ఈ చెట్లు కనిపిస్తాయి. ఈ పూల రెక్కలను నోట్లో పెట్టుకుని చప్పరిస్తే బుడగ వస్తుంది. దానిని నుదుటి మీద కొట్టుకుంటారు. పిల్లల నుదిటి మీద కొడితే నవ్వుతుంటారు. ఇలా ఆటలు ఆడుతుంటారు. వీటిని ‘‘తేనె పుప్వులు’’ అనీ కూడా అంటారు.
ఎరుపు తెలుపు కలగలసిన ముళ్ళ గోరింటలు. గులాబీలతో పాపను తయారు చేశాను. కొన్ని శంకు పూలను కూడాు వాడాను. జుట్టు నిండా ముళ్ళ గోరింటలు పెట్టాను. గులాబీ రెక్కలు, కాడలతో కళ్ళు, నోరు పెట్టాను. గులాబీ ఆకు ముక్కుగా మారింది. కాళ్ళకు శంకు పూలు పెట్టాను. ఈ శంకులు ఊదా రంగులో ఉన్నాయి. గులాబీల ఫ్రాక్ కుట్టాను. బ్లౌజ్ కూడా గులాబీల డిజైనే. మరి మా పాప అందంగా ఉందా?.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి