ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ తాండూర్ శాఖ సేవా కార్యక్రమం
ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ తాండూర్ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బుధవారం నోటు పుస్తకాలు, విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.
మంబాపూర్, ఖానాపూర్, దుగ్గాపూర్, రుక్మాపూర్, మదనంతాపూర్, మాన్సాన్‌పల్లి ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 260 మంది విద్యార్థులకు 1,100 నోటు పుస్తకాలు, 25 స్లేట్లు, 260 పెన్సిళ్లు, 260 రబ్బర్లు, 260 స్కేళ్లు పంపిణీ చేయడంతో పాటు చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, ఫ్రూటీ అందజేశారు.
ఈ సందర్భంగా జాతీయ కన్వీనర్ మన్మోహన్ సార్డా మాట్లాడుతూ, గత 35 సంవత్సరాలుగా ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ తాండూర్ శాఖ విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకుని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శాఖ అధ్యక్షుడు కిషన్ రాఠీ, కార్యదర్శి కరణ్ జైన్, సభ్యులు అనిల్ సార్డా, శ్రీకాంత్ సార్డా ,నిఖిల్ గాగ్రాణి, కిషన్ బూబ్, అంకిత్ సార్డా, దీపక్ బూబ్, దీపక్ సోని, గిరిధర్ పార్టాని, మాధవ్ పార్టాని, నితిన్ సార్డా పాల్గొన్నారు. సామాజిక కార్యకర్త KVM వెంకట్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి