కౌసల్యాదేవిని సుమిత్రాదేవి ఓదార్చుట
--------------------
సకల సద్గుణసంపన్నుడతని కొరకు
దీనముగా విలపించుటయు నీకు తగదు
అతడు వనమున క్షేమముగా యుంటాడు
" ఓ పూజ్యు రాలా! నీ ముద్దుల పుత్రుడు
మిక్కిలి బుద్ధి బలమును గలవాడు
అతడు తండ్రి మాట నిలుపుటకై
ధర్మమునకు కట్టుబడి వనమునకెళ్లెను
శ్రీరామునికి తోడుగా లక్ష్మణుడు వెళ్ళెను
జనకుని యొక్క కూతురు సీతాదేవి
స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవమని తలచి
తన పతితో వనవాసమునకు వెళ్లెను
శ్రీరాముని త్రికరణ శుద్ధినెరిగిన మన కులదైవమైన
సూర్యుడు తన కిరణములచే
ఆయనశరీరమునకు బాధను కలిగించడు
వాయువు తన చల్లటి గాలితో సేవించును
శ్రీరాముని రాత్రివేళలలో చంద్రుడు
తన చల్లని కిరణములచే స్పృశించును
ఓ దేవి! శ్రీరాముడు వనవాసమును
సునాయసముగను పూర్తిచేసి వచ్చును

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి