49వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
పల్లె ప్రజలు కైకేయీ దశరథులను తప్పుపట్టుట 
-----------------------



శ్రీరాముని ప్రయాణము కొనసాగుచుండగా 
ఇంతలో శుభోదయము అయ్యెను 
శ్రీరాముడు స్నానజపములు ముగించుకొని 
కోసలదేశమునకు దక్షిణ దిశగా సాగిపోవును 

జనకమహారాజుయొక్క గారాలపట్టి 
మహా సాద్వియైనా సీతాదేవి
సుఖములలో పుట్టి పెరిగినదాతల్లి 
వనవాసకష్టములనెలాఓపగలదు 

అయ్యో! దశరథమహారాజుకు 
వారిని 
అడవికి పంపుటకు మనసేలా ఒప్పినది
పల్లె జనులన్న మాటలను వినుకుంటూ 
ముందుకు సాగిపోవుచు యుండెను రాముడు 

శ్రీరాముడు పవిత్ర జలములతో 
ప్రవహించుచున్న వేదశ్రుతి నదిని దాటి 
అగస్త్యమహర్షి నివసించునట్టి 
దక్షిణదిశకు ప్రయాణించెను.

అతడు కొంతకాలము ప్రయాణముచేసి
గోమతితీరమునకు చేరును 
అందులోని జలములు స్వచ్ఛమైనవి 
అతడు గోమతి తీరమును దాటిపోవును

కామెంట్‌లు