మా ఖానాపూర్ బడిలో సర్వేపల్లి రాధాకృష్ణన్
కొలువై ఉన్నాడు.
ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు.
బడి పిల్లలు అందరూ బుద్ధిమంతులవుతున్నారు.
మా బడికి
చేప పిల్ల వచ్చింది
చెరువు అంతా తిరిగింది
చదువుతోపాటు ఈత నేర్చుకుంది.
తిరిగి ఇంటికి వెళ్ళింది.
మా బడికి
తాబేలు వచ్చింది
తడబడుతూ తిరిగింది.
మెల్లిమెల్లిగా చదివి గెలిచింది.
మళ్లీ మళ్లీ బడికి వచ్చింది.
మా బడికి
కొంగ వచ్చింది
దొంగ జపం చేసింది.
బెంగతో చదువుకుంది
దొంగతనం మానింది.
మా బడికి
బాతు బిడ్డ వచ్చింది
బంగారు గుడ్డు పెట్టింది
బాగా చదివింది
మంచి పేరు తెచ్చుకుంది.
మా బడికి
కప్ప బిడ్డ వచ్చింది
బెకబెకమని అరిచింది
భయంతో చదువుకుంది.
భద్రంగా ఇంటికి చేరింది.
===========================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి