55వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
సీతారామలక్ష్మణులు యమునానదిని దాటుట
-------------------------



శత్రుసంహారకులైన రామలక్ష్మణులు 
భరద్వాజాశ్రయమున ఆ రాత్రి గడిపి 
మరునాడు ఆ మహర్షికి నమస్కరించి 
ఆయన అనుమతితో బయలుదేరినారు

ఆ మహర్షి వారితో కొంత దూరమునడిచి 
వెళ్లవలసిన మార్గములను గూర్చియు 
తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపును 
అతని మాటలను జాగ్రత్తగా విన్నారు  

"ఓ నర శ్రేష్టులారా! గంగాయమునాసంగమ 
ప్రదేశమును మీరు చేరినాక
పశ్చిమాభిముఖులై యమునానది తీరమును
అనుసరించి ప్రయాణము చేయుడు. 

ఓ శ్రీరామా! యమునానది తీరమున 
జనులు నడిచే ప్రాచీనరేవును జూచి
వారి అడుగుజాడలను బట్టి 
ఆరేవును గుర్తించి తెప్పపైప్రయాణించుడు 

ఆవలి తీరమున శ్యామము అను మర్రిచెట్టు కలదు  
ఆ వృక్ష ఛాయలో సిద్ధులు నివసించెదరు 
సీతాదేవి ఆ వృక్షమునకు నమస్కరించి
శుభాశీస్సులను పొందవలెను 

కామెంట్‌లు