ప్రవాస పద్య పరిమళం - 56: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 అంశము: న్యస్తాక్షరి
విషయము: స్త్రీల  ఔన్నత్యం  
ఛందస్సు : మత్తేభం
న్యస్తాక్షరి:  స-త్య-భా-మ  అక్షరాలని ఇదే క్రమంలో 4 పాదాలలో 
1 వ పాదము 17 వ అక్షరము  = స
2 వ పాదము 14 వ అక్షరము = త్య
3 వ పాదము 4 వ అక్షరము = భా
4 వ పాదము  18 వ అక్షరము = మ



మత్తేభము :

జయహో భారతి  మాతృమూర్తి గృహిణీ చైతన్య (స)మ్మానితా 
దయకారణ్యము దీనులన్కనగ ప్ర(త్య)క్షంబు మాతామహీ 
ప్రియ సం(భా)షిణి గేహినీ అతిథులన్ప్రీతిన్ సదా సౌమ్యతన్ 
జయముల్ నిత్యము సవ్యసాచి సబలా చాముండిగా (మ)న్ననల్ 
======================================
కామెంట్‌లు