చిగురు: - అన్నారం సమన్విత-6వ,తరగతి.-జిపఉపా:బక్రిచెప్యాల -జిల్లా: సిద్ధిపేట.-9704865816.


 అశ్విత్,అక్షర అన్నా,చెల్లెళ్లు.వారు ఇద్దరు పక్కూరికి వెళ్లి చదువుకుంటారు.
ఇద్దరికి ముందుచూపు ఎక్కువ.వారికి ప్రకృతి,పచ్చదనం అన్నా చాలా ఇష్టం.వారికి వేసవి సెలవులు ఇచ్చారు.ఎండలు ఎక్కువగా ఉన్నాయి.ఇద్దరు కలిసి ఆటలాడి ఒక చెట్టు నీడ కింద కూర్చున్నారు.అన్నయ్యా!ఎండలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి.చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయి.ఇంత తక్కువ ఎందుకున్నాయి అని అక్షర అడుగుతుంది.అప్పుడు అన్నయ్య ఇలాఅంటాడు.చెట్లు లేక పోవడం వలన ఎండలు ఎక్కువగ ఉంటాయి.వర్షాలుపడవు.
ఉడకపోత ఎక్కువగాఉంటుంది అని అంటాడు.ఇద్దరు బాగా ఆలోచిస్తారు.వర్షాకాలంలో ఏదైన ఒకపాయం ఆలోచించాలి అని అనుకుంటారు.
అలా వేసవి సెలవులు అయిపోయాయి.బడి మొదలైంది.వారికి బడిలో  బుక్కులు, పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు ఇచ్చారు.బడి సాయంత్రం 4-15 విడిచిపెడతారు. సాయంత్రం ఇంటికి వెళ్తుండగ అనుకోకుండ పెద్ద వర్షం పడుతుంది. వాళ్ళ బుక్కులు, పుస్తకాలు తడిసిపోతాయని ఒక చెట్టు కింద ఆగినారు.
అశ్విత్,అక్షర  అమ్మ పెట్టించిన  స్నాక్స్ డబ్బాలోని మొలకలు తింటుంటారు.అందులోని
కొన్నిమొలకలు కింద పడుతాయి.వారు దాన్ని అంతగా పట్టించుకోలేదు. మామూలుగానే మూత పెట్టేసి వర్షం ఆగిపోయాక ఇంటికి వెళ్తారు.అలా ఒక వారం గడుస్తుంది.బడి ఐపోగానే ఇంటికి వెళ్తుండగ ఆకాశం మేఘాలతో నిండిపోయింది.వర్షం పడుతుందని అదే చెట్టు కింద ఆగుతారు.
అప్పుడు అక్షరకి కొన్ని మొలకలు కనిపిస్తాయి.వాటిని బాగా పరిశీలిస్తారు.ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి అని ఆలోచిస్తారు.
పోయిన వారం మనం టిఫిన్ బాక్స్ లో మొల్కలను తీసుకెళ్లాం కదా!.ఆ మొలకల్లో కొన్ని ఇక్కడ పడ్డాయని అశ్విత్ చెబుతాడు.చిన్ని మొక్కలు లేతచిగురులతో ఎంత అందంగా ఉన్నాయని అక్షర అంటుంది.
వర్షం ఆగిపోయాక ఇంటికి వెళ్తారు.ఇంటివద్ద ఇలా మాట్లాడుకుంటారు. అన్నయ్యా మనం ఆ చిన్ని మొక్కలకు రోజు నీళ్లు పోస్తాంఅని చెల్లి చెబుతుంది.వాటికి లేత కొమ్మలు,చిగుర్లు వస్తాయి. పెద్దగా పెరిగినంక అందరికి నీడనిస్తాయి.పండ్లనిస్తాయి. బాటసారులను ఎండనుండి,వాననుండి కాపాడతాయి.మనం నాటినచెట్లు ఇతరులకు సహాయపడితే మనకు పుణ్యం వస్తుందని మన సైన్సు టీచరు చెప్పారని అక్షర అంటుంది.దానికి అశ్విత్ అవును చెల్లి నిజమే
మనం ఇంకాకొన్ని చెట్లు పెడదాము. అవి పెద్దయ్యే వరకు నీళ్లు పోసి కాపాడదాం అని అశ్విత్, అక్షర అనుకుంటారు.ఈ చిన్నారుల ఆలోచనలను అందరు మెచ్చుకుంటారు.
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Good