ప్రవాస పద్య పరిమళం - 62: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 అంశము: వర్ణన  
విషయము: దుర్గా స్తుతి 
ఛందస్సు : చంపకమాల




చంపకమాల:

జగముల గావగా జనని చారు సుహాసిని శాంత రూపిణీ
అగణిత సిద్ధి ఆశ్రిత జనావళి కండగ శక్తి  రూపిణీ 
తెగువన దైత్యులన్దునుము ధీమతి గౌరి త్రిశూల ధారిణీ 
నగజ  గిరీశు రాణి నిను నామది గొల్తును నిష్కళంకిణీ 
==========================
కామెంట్‌లు