ఆబాలగోపాలమే!
బావుందా అనేసరికి ,
"ఎస్సే "సమాధానమే!
గాన కోకిల ఆరు ఋతువుల,
వసంత విహారమే!
పగలే శరస్చంద్రికల స్పర్శ,
మలయమారుతమే !
నీ లీల పాడెద దేవా,
తన్మయ ఉనికి, జానకి!
శ్రీరామ మూర్తి సత్యవతుల,
పుట్టినది సిరిసిల్లా!
సినీ సంగీత సామ్రాజ్యం ,
కట్టింది సరిగమల ఖిల్లా!
మూడవ ఏట నుండే ,
పాటల ఊటలు, సుభాన్ అల్లా!
ఉద్దండ విద్వాంసుల వద్ద ,
నేర్చిన మెలుకువలెల్లా!
పాడిన పాట వీనుల,
విందు చేసే రసగుల్లా!
ప్రముఖ గాయని మణుల,
పాటల నిత్యాభ్యాసము!
పంతొమ్మిదవ ఏటే చెన్నై,
మకాం మార్చుకోవడము!
"విధాయన్ విలాయత్తు" ,
గాన మహాప్రస్థానారంభము!
ఎం. ఎల్ .ఏ. తెలుగు సినిమా ,
పాటల గాన శ్రీకారము!
సంగీత దర్శకత్వం, రచన,
విద్వత్తుల సంగమము!
సెమీ క్లాసికల్, భక్తి,పాప్,
డిస్కో--వైవిధ్య గానం!
పాటలో "మిమిక్రీ" బంగారు,
నగలో "రత్నం" పొదగడం!
ఐదు తరాల నాయకిలకు,
నేపద్య గాత్ర దానం!
గాయకులందరూ ,,"ఎస్పీ",
ముఖ్యం,మధుర యుగళం!
సంగీత దర్శకులు తలలూపే,
సుస్వర సంధానం!
వేలసినిమాలు, వేవేల పాటలు,
తేనెల సోనలు!
జాతీయస్థాయి ఉత్తమ గాయని,
నాలుగు మారులు!
వివిధ రాష్ట్రాల పురస్కారాలు,
ముప్పై ఒకటి సారులు!
విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేటు,
కలైమామణి స్వీకారాలు!
జా. న. కి.--జాగృతి ఆకృతి,
నవరసశ్రుతి, కిన్నెరసానిగతి!
________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి