మితమైన ఆశలు, ఆకాంక్షలున్న నేను
ఆధునిక కాలంలో
ఓ అనామకుడిగానే మిగిలిపోతున్నా!
అవినీతిపరులకునేను వత్తాసుపలకనందుకు?!
పరాన్నజీవులతో నేను సహవాసం చేయనందుకు?!
పూటకో వేషం
మాటమాటకో అబద్ధం
వల్లె వేయనందుకు!?
సచ్ఛీలత
సహనశీలత్వం
సమతావాదం
మానవతావాదం
ఇవి విశిష్టగుణాలైనా
టోకుగా అవుడేటెడ్
పదాలంటున్నారు
ఈ కాలపు (అ)ధర్మాధిపతులు
కలికాలపు కంత్రితనం,
కల్లబొల్లితనం
ఊసరవెల్లి నైజం
పుణికిపుచ్చుకోలేని
నేను
ఎప్పటికీ ఒంటరినే
నేను నాలాగే ఉంటా
నేను ఇలాగే ఉంటా
నేను చచ్చినా
రేపు
మీ హృదయాంతరాల్లో
ఓ మధుర జ్ఞాపకమై
సజీవంగానే ఉంటా!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి